-

23 నుంచి తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు

21 Dec, 2017 02:19 IST|Sakshi

సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం 2018, జనవరి ఒకటో తేది పురస్కరించుకుని ఈనెల 23 నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే టికెట్లు జారీ చేస్తామని, వీఐపీ సిఫారసులకు టికెట్లు కేటాయించబోమని స్పష్టం చేసింది. ఈనెల 28 నుంచి జనవరి 1 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దివ్యదర్శనం, చంటి బిడ్డల తల్లి దండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం 4 గంటలు ఆలస్యం కానుంది. ఉదయం 5 నుంచి శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. తొలుత ప్రొటోకాల్‌ ప్రముఖులకు దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు