హిందీకి రాజధాని విశాఖ

12 Dec, 2016 14:26 IST|Sakshi
హిందీకి రాజధాని విశాఖ

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: హిందీయేతర ప్రాంతాల్లో హిందీకి రాజధాని విశాఖపట్నం అని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. జనవరి 6 నుంచి మూడు రోజులపాటు విశాఖలోని గీతం విశ్వ విద్యాలయంలో నిర్వహిం చనున్న నాలుగో అంతర్జాతీయ హిందీ సమ్మేళనానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయంలో నిర్వహించారు.

సమావేశంలో పాల్గొన్న యార్లగడ్డ మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ విభాగం 60 ఏళ్లకుపైబడి ఉందని, వందలాది పరిశోధనా గ్రంథాలు, హిందీ కవులు, పండితులతో ఈ విభాగం అలరారుతోందన్నారు. హిందీయేతర ప్రాంతాల్లో ఉంటున్న తాము హిందీ బోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమ్మేళనంలో చర్చించనున్నట్టు యార్లగడ్డ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు