కిలిమంజారో ఎక్కేశాడు

8 Sep, 2019 07:22 IST|Sakshi
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గోసల రాజు

రాజయ్యపేట యువకుడు గోసల రాజు ప్రతిభ

సాక్షి, నక్కపల్లి: రాజయ్యపేటకు చెందిన మత్య్సకార యువకుడు గోసల రాజు దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. 5,895 మీటర్ల ఎత్తున ఉన్న ఈ పర్వతాన్ని ఈ నెల 5న అధిరోహించినట్లు రాజు తెలిపాడు. ఈ నెల మూడో తేదీన ట్రెక్కింగ్‌ ప్రారంభించి 5వ తేదీన దిగ్విజయంగా ఎక్కినట్టు పేర్కొన్నాడు. మైనస్‌ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో యాత్రను దిగ్విజయంగా పూర్తిచేశాడు. ఇంటర్‌ వరకూ చదువుకున్న రాజు గతంలో 2018 మే17వ తేదీ ఎవరెస్టు శిఖరం, 2018 సెప్టెంబర్‌ 18న రష్యాలోని మౌంట్‌ ఎలబ్రస్, 2019  ఫిబ్రవరి 14న అంకాగ్వా పర్వతాలను కూడా అధిరోహించాడు. హైదరాబాద్‌లో ని ట్రాన్స్‌జెండర్‌ అడ్వంచర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ సాహస యాత్రలు చేస్తున్నట్లు రాజు పేర్కొన్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన అంటార్కిటికా, ఆస్ట్రేలియా నార్త్‌ అమెరికాలోని దేనాలిలను అధిరోహించడమే తన లక్ష్యమని ‘సాక్షి’కి చెప్పాడు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు