కిలిమంజారో.. బాలిక భళామంజారో!

5 Oct, 2014 01:23 IST|Sakshi
కిలిమంజారో.. బాలిక భళామంజారో!

సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా వడ్డాదికి చెందిన బాలిక జాహ్నవి(12) మరో కీర్తి శిఖరం అధిరోహించింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన శిఖరమైన కిలిమంజారోపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల (19,341 అడుగులు) ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించి రికార్డుకెక్కింది. ప్రపంచంలో మరో పర్వతానికి ఆనుకోకుండా ఉన్న శిఖరాల్లో ఇదే అత్యంత ఎత్తయినది. భారతీయుల్లో ఈ శిఖరం ఎక్కిన అత్యంత పిన్న వయస్కురాలు ఈమేనని చెబుతున్నారు. గాంధీ జయంతి రోజునే ఈ శిఖరాన్ని అధిరోహించి.. అక్కడ మహాత్మా గాంధీ ఫొటోను ప్రదర్శిస్తూ శాంతిసామరస్యాల ఆవశ్యకత సందేశాన్ని ఆమె ప్రపంచానికి చాటింది. అత్యంత ప్రమాదకరమైన మాకెమె మార్గంలోనే కిలిమంజారోను అధిరోహించి స్థానిక అధికారులతో ఔరా అనిపించుకుంది జాహ్నవి.

 

 

మరిన్ని వార్తలు