విశాఖ పర్యాటకానికి మూడు అవార్డులు

27 Sep, 2019 09:14 IST|Sakshi

 ఢిల్లీలో నేడు అవార్డులు అందుకోనున్న మంత్రి అవంతి

సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటున్న విశాఖపట్నం జిల్లా పర్యాటకం మూడు జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏటా పర్యాటక అవార్డుల్ని అందజేస్తుంది. ఈ ఏడాది మూడు విభా గాల్లో విశాఖపట్నం అవార్డులు దక్కించుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీ లోని విజ్ఞాన్‌భవన్‌లో శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీని వాసరావు అందుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ మూడు విభాగాల్లో విశాఖ అవార్డులు కైవసం చేసుకుందని తెలిపారు. కాంప్రిహెన్సివ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ విభాగంలో బెస్ట్‌ స్టేట్‌ అవార్డుతో పాటు హ్యాండీక్రాఫ్ట్సŠ, సాగర తీరాలపై ప్రచురించిన పుస్తకాలు పబ్లిషింగ్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ విభాగంలో మరో అవార్డు, విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ బెస్ట్‌ టూరిస్ట్‌ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా అవార్డు సొంతం చేసుకున్నాయని వివరించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు విశాఖ దక్కించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అవంతి అన్నారు. భవిష్యత్తులో విశాఖ పర్యాటకాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసి మరిన్ని అవార్డులు సాధించే దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని అవంతి అన్నారు.      

మరిన్ని వార్తలు