విశాఖ నుంచి సింగపూర్‌కి నేరుగా విమానాలు

28 Aug, 2019 14:50 IST|Sakshi

సాక్షి, విశాఖ :  విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్ లో సింగపూర్ టూరిజం బోర్డు అధికారులు, స్కూట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్టోబర్ 27 నుంచి వారంలో అయిదు రోజులు నేరుగా విశాఖ నుంచి సింగపూర్ కి విమానాలు నడపనున్నట్లు స్కూట్‌ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. మంగళవారం, గురువారం మినహా మిగిలిన అయిదు రోజుల పాటు సర్వీసులు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

ఈ విమానం సింగపూర్లో రాత్రి 8.45 నిమిషాలకి బయలుదేరితే రాత్రి 10 గంటలకి విశాఖకు  చేరుకోనుందని,( భారత కాలమాన ప్రకారం నాలుగు గంటల ప్రయాణం)విశాఖలో రాత్రి 11 గంటలకి బయలుదేరితే, సింగపూర్‌కి‌ తెల్లవారుజామున 5.45 కి చేరుకోనుందని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు సింగపూర్ టూరిజం బోర్డు ప్రతినిధులు శ్రీధర్,  లిమ్ సి టింగ్, పూజ, బ్రియాన్ టోరే, భరత్, నితిన్, కె.విజయ్ మోహన్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోషియేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా