గ్యాస్‌ సిలిండర్‌ పేలి అన్నాచెల్లెళ‍్ల మృతి

11 Oct, 2019 10:54 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని సాగర్‌ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. సాగర్ నగర్ హెచ్‌ఐజీలో ఆర్టీసీ రీటైర్డ్ జేఈ చల్ల ఉమా మహేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఉమ మహేశ్వరరావు, కొడుకు, కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్ర పోయారు. అర్ధరాత్రి వాళ్లింట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు స్థానికులు గుర్తించారు. ఆ ఘటనలో కుమారుడు సతీష్ చంద్ర (38), కూతురు లావణ్య (32) మృత్యువాత పడ్డారు.  ఉమా మహేశ్వరరావు ప్రాణాపాయ స్థితిలో వున్నారు. 

అయితే వీరిది ఆత్మహత్యే అంటున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలం క్రితం ఉమా మహేశ్వరరావు భార్య మరణించింది. అప్పటి నుంచి ఆయన కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఉమా మహేశ్వరరావు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. మానసిక సమస్యల నేపథ్యంలోనే గ్యాస్‌ లీక్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డొంక కదులుతోంది

వైఎస్సార్‌ జిల్లా నూతన ఎస్పీగా అన్బురాజన్‌

నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి

పక్కదారి పడుతున్న పోలీసుల దర్యాప్తు !

అందరూ ఉండి అనాథైన బామ్మ

నన్నయ వర్సిటీలో లైంగిక వేధింపులు

ప్లీజ్‌ దయచేసి 'లావు' ఉండొద్దు

నక్షత్రానికో మొక్క.. రాశికో చెట్టు

కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు

నాకు న్యాయం చేయండి

బోర్డుల పేరుతో బొక్కేశారు!

గ్రామసభల్లో ఇళ్లపట్టాల అర్హుల జాబితా

అరుదైన ఉత్తరం.. సోషల్‌ మీడియాలో వైరల్‌

పన్ను భారీగా ఎగవేస్తున్నారు...! 

వైఎస్‌ జగన్‌ మరో కీలక నిర్ణయం 

బాలుడిని మింగేసిన కాలువ

అస్మదీయుడికి అందలం

గురుకులం నిర్వహణపై కలెక్టర్‌ కన్నెర్ర 

మీ మనవడిని.. మీ ‘కంటి వెలుగు’ని..

కన్నతల్లిని కంటికి రెప్పలా చూడాలి 

కరెంట్‌ షాక్‌లకు కారకులెవరు?

కరుణ చూపండి..మరణం ప్రసాదించండి

మళ్లీ బిరబిరా కృష్ణమ్మ..

విద్యకు వందనం

బోటు ప్రమాదంపై దిగజారుడు రాజకీయాలు

పోలీసులూ.. మీ సంగతి చూస్తా

జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేలు

కమీషన్ల కోసం చౌక విద్యుత్‌కు కోత!

ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!

టిక్‌టాక్‌ హీరో.. సినీ స్టార్స్‌ ఫాలోయింగ్‌

సాఫ్ట్‌వేర్‌ సత్యభామ

బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..