విశాఖపట్నం : మీ ఓటు ఉందా.. వెం‍టనే సరి చూసుకోండి..

10 Mar, 2019 12:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
- 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 
 - కలెక్టరేట్‌లోని కాల్‌ సెంటర్‌ ల్యాండ్‌ లైన్‌ నెం : 0891–2534426
 - కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి : కే.పద్మ, పీడీ, డ్వామా : 9490914671
 - జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 
 - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
 - సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. 

- ఆర్డీవో ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన నంబర్‌: 9618827134, (ఆర్‌వో: జి.సూర్యనారాయణరెడ్డి)
- తహసీల్దార్‌ కార్యాలయం ఎలక్షన్‌ సెల్, ఫోన్‌ నంబర్లు 
    యలమంచిలి    : 9100064953
    అచ్యుతాపురం    : 9100064943
    రాంబిల్లి        : 9100064952
    మునగపాక    : 9100064951

- మీ సమీపంలోని బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ (బీఎల్‌ఓ) వద్ద ఆ బూత్‌ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. 
-  ఒకవేళ మీ ఓటు లేదని తెలిస్తే.. పై మూడు స్థాయిల్లోనూ అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి, ఫారం–6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు.
- మీ–సేవ కేంద్రాల్లోనూ నిర్ణీత రుసుము తీసుకుని ఓటు ఉందో లేదో తెలియ చెబుతారు. అక్కడే ఓటు నమోదు చేస్తారు.
 - ఎన్నికల షెడ్యూల్‌/నోటిఫికేషన్‌ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్‌ నుంచి బూత్‌ లెవల్‌ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఆర్డీఓ, ఎమ్మార్వో, బూత్‌ లెవల్‌ అధికారిని సంప్రదించాలి. 

    ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం

మరిన్ని వార్తలు