విశాఖ తెరపై సినీ వివాదం

4 Aug, 2016 03:15 IST|Sakshi

జూనియర్ ఆర్టిస్టులకు సొమ్ము ఎగ్గొడుతున్నారని ఫెడరేషన్ ఆరోపణ

విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు విశాఖ రాజధానిగా మారుతున్న తరుణంలో సినీవర్గాల మధ్య రేగిన వివాదం పోలీసు కేసుల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. సినీ నిర్మాత, డెరైక్టర్, హీరోతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు వివాదం తలెత్తడం చర్చనీయాంశమైంది. అజయ్ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నిర్మాత అచ్చిబాబు ‘ఒక్కడే మిగిలాడు’  చిత్రం నిర్మిస్తున్నారు. విశాఖ సమీప పరవాడ వద్ద ముత్యాలమ్మపాలెంలో గత నెల 15న షూటింగ్ ప్రారంభించారు. జూనియర్ ఆర్టిస్టుల కోసం స్థానిక ఏజెంట్లను సంప్రదించారు.

ఆ మేరకు రాంబాబు అనే ఏజెంట్ నగరంలోని అన్ని ఫెడరేషన్ల నుంచి 1480 మందిని సమీకరించి  సరఫరా చేశారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.850 చెల్లించాలి. ఈ లెక్కన జూలై 30 నాటికి రూ.16.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే నిర్మాత రూ.5.50 లక్షలే ఇచ్చారు. ఇది ఇరువర్గాల మధ్య వివాదానికి దారితీసింది. వారు పరవాడ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా చిత్ర నిర్మాత, హీరో మీడియా ముందుకు వచ్చి ఫెడరేషన్లపై ఆరోపణలు గుప్పించారు.
 
 

మరిన్ని వార్తలు