‘కరోనా వైరస్‌పై జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం’

29 Jan, 2020 20:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్‌కు సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నం పోర్టు అధికారులు బుధవారం తెలిపారు. కరోనా వైరస్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8. 25 గంటలకు సింగపూర్ నుంచి ఎం వీ ఫార్చ్యూన్ సన్ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరిందని సిబ్బంది తెలిపారు. అంతే కాకుండా ఆ నౌకలో 21 మంది చైనా దేశానికి చెందనవారు ఉన్నారని వెల్లడించారు. దీంతో వారందరికీ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోర్టు ఆరోగ్య అధికారి డాక్టర్‌ క్రాంతి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. (‘కరోనా’ ఎఫెక్ట్‌; ఐకియా కీలక నిర్ణయం)

ఈ పరీక్షల అనంతరం పోర్టు ఆరోగ్య అధికారి కాంత్రి మాట్లాడుతూ.. ఆ నౌక నుంచి వచ్చిన వారికి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు, వైరస్‌ సమస్యలు లేవని నిర్ధారించామన్నారు. తర్వాత 10: 35 గంటలకు పోర్టు అధికారులు ఆ నౌకలోకి సరకు నింపేందుకు అనుమతి ఇచ్చారు. పోర్టుకు వచ్చిన ప్రతి నౌకకు సంబంధించిన సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే పోర్టులో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నామని విశాఖపోర్టు అధికారులు తెలిపారు. (‘కరోనా’ నుంచి రక్షణకు హెల్మెట్‌)

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన అన్ని జాగ్రత చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కరోనాకు సంబంధించి పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని.. సిబ్బందికి 95 మాస్కులు, గ్లౌజులు, అన్ని రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచామని విశాఖ పట్నం పోర్టు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పోర్టు అధికారులు పేర్కొన్నారు. (చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్లు..)


 

>
మరిన్ని వార్తలు