రేషన్‌ కోసం తొందర వద్దు

31 Mar, 2020 13:17 IST|Sakshi
రేషన్‌ డిపోను పరిశీలిస్తున్న జేసీ శివశంకర్, కేకే రాజు

15 వరకు సరకుల పంపిణీ

డీలర్లు, వలంటీర్లు చెప్పిన సమయానికే లబ్ధిదారులు వెళ్లాలి

ఎండ తీవ్రత దృష్ట్యా గొడుగులు తీసుకెళ్లాలి

ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులకూ రేషన్‌

జాయింట్‌ కలెక్టరు

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా జిల్లాలోని 12.45 లక్షల మంది రేషన్‌ కార్డుదారులకూ సరుకులు అందుతాయని జాయింట్‌ కలెక్టరు ఎల్‌.శివశంకర్‌ భరోసా ఇచ్చారు. బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తున్నందున తమకు అందవనే ఆందోళనను కార్డుదారులు వీడాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చేపట్టిన చర్యల్లో భాగంగా రోజుకు వంద నుంచి 150 కార్డుదారులకు మాత్రమే రేషన్‌ ఇచ్చేలా ప్రతి రేషన్‌ డిపో వద్ద డీలర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకటో తేదీ నుంచి ప్రారంభించాల్సిన రేషన్‌ సరుకుల పంపిణీని లాక్‌డౌన్‌ దృష్ట్యా ఈనెల 29వ తేదీ నుంచే ప్రారంభించినట్లు చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఇందుకోసం ప్రతి రోజూ ఒక్కో డిపో వద్ద వంద నుంచి 150 మందికి మాత్రమే రేషన్‌ సరుకులు ఇచ్చేలా డీలర్లు, సంబంధిత వార్డు సచి వాలయంలోని వలంటీర్లు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 11 గంటల మధ్యకాలంలో ఎవరెవరు ఏ సమయంలో డిపోకు రావాలో వారు చెబుతారని, లబ్ధిదారులు వారికి సహకరించాలని కోరారు. ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ సరుకుల పంపిణీ కొనసాగుతుందన్నారు. ఏ ప్రాంతం వారైనా పోర్లబులిటీ సౌకర్యం ద్వారా తమకు అందుబాటులో ఉన్న డిపో నుంచి సరుకులు తీసుకోవచ్చన్నారు. 

అక్కయ్యపాలెం/సీతమ్మధార (విశాఖ ఉత్తర) : రేషన్‌ డిపోల వద్ద సామాజిక దూరం పాటించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌  ఎల్‌.శివశంకర్‌ అన్నారు. నగరంలోని 25, 26, 43, 44 వార్డుల్లో  రేషన్‌ షాపుల్లో జరుతున్న రేషన్‌ పంపిణీని పరిశీలించారు. సీతంపేట, అక్కయ్యపాలెం ప్రాంతాలలో రేషన్‌ షాపులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సరఫరా అధికారి నిర్మలాభాయి, అర్బన్‌ తహసీల్దార్‌ ఎ.జ్ఞానవేణి , వైఎస్సార్‌ సీపీ నమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ నాయకురాలు పెద్దిశెట్టి ఉషశ్రీ పాల్గొన్నారు. అలాగే 24వ వార్డు గాంధీనగర్‌ 565 వార్డుల్లో రేషన్‌ షాప్‌ను జేసీ శివశంకర్‌ పరిశీలించారు.  

అందరికీ రేషన్‌ సరకులు
భీమునిపట్నం: రేషన్‌ సరకుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎ స్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తంశెట్టి మహేష్‌ అన్నారు. సోమవారం ఆయన భీమి లిలో రేషన్‌ సరకుల పంపిణీని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరారు. ఒకేసారి ఎక్కువ మంది రాకుండా టోకెన్లు అందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు