వైజాగ్‌లో భారీ వర్షం

4 Jun, 2020 11:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : నగరంలో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా విపరీతమైన వేడి, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన విశాఖ వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారడంతో వైజాగ్‌ ప్రజలకు వడగాల్పుల నుంచి ఊరట లభించింది. (డీపీఆర్‌ పట్టాలపై విశాఖ మెట్రో)

ఉత్తర కోస్తాకు వర్ష సూచన
నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతూ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించాయని, గురువారం మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతు పవనాల ఆగమనానికి సంకేతంగా, మరోవైపు తూర్పు మధ్య అరేబియాలో కొనసాగుతున్న నిసర్గ్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ గంటకు గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.  

పిడుగు పాటుకు ఇద్దరు మృతి
బుధవారం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కోటపర్తి రంగయ్య (45), సోమెలి గంగమ్మ(55)లు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడిలో పాలూరి చెరువులో పని చేస్తున్న ఉపాధి కూలీలు 26 మంది పిడుగుపాటుతో అస్వస్థతకు గురయ్యారు. (డాక్టర్‌ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద సీబీఐ కేసు)

మరిన్ని వార్తలు