స్టీల్ ప్లాంట్ ఏజీఎం హత్య కేసులో వీడిన మిస్టరీ

10 Jan, 2015 10:12 IST|Sakshi

విశాఖపట్నం: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో దారుణ హత్యకు గురైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ ఏజీఎం సూర్య ప్రసాద్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను శనివారం పోలీసులు భువనేశ్వర్లో అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారిస్తున్నారు. నగదు కోసమే సూర్యప్రసాద్ను హత్య చేసినట్లు దుండగులు తమ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.

జనవరి మొదటి వారంలో ఒడిశా భువనేశ్వర్లోని సైనిక పాఠశాల వద్ద సూర్య ప్రసాద్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పక్కనే ఉన్న బ్యాగ్లో విమానం టిక్కెట్తోపాటు ఆయన వివరాలతో పోలీసులు గుర్తించారు. దాంతో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ ఏజీఎం సూర్యప్రసాద్గా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు