రేపు విశాఖ-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

25 Sep, 2019 19:42 IST|Sakshi

లాంఛనంగా ప్రారంభించనున్న రైల్వేశాఖ సహాయమంత్రి

ఎల్లుండి నుంచి పూర్థిస్థాయిలో సేవలు

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం-విజయవాడ మధ్య ప్రతిష్టాత్మకమైన డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్ర్‌ప్రెస్‌ సర్వీసులు గురువారం లాంఛనంగా ప్రారంభమవుతాయని, శుక్రవారం నుంచి ఈ సర్వీసులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయని భారత రైల్వే శాఖ వెల్లడించింది. విశాఖ-విజయవాడ మధ్య వారంలో ఐదురోజులపాటు డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ యాత్రీ ఎక్స్‌ప్రెస్‌(ఉదయ్‌)ను నడపనున్నట్టు తెలిపింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌ చెన్నబసప్ప అంగడి గురువారం లాంఛనంగా ఉదయ్‌ను ప్రారంభిస్తారని తెలిపింది. ప్రారంభోత్సవరం సందర్భంగా 02701 నంబర్‌ ఉయద్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరుతుందని, ఈ రైలు కోసం బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని పేర్కొంది.

2701 నంబర్‌ ఉయద్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 11.30లకు విశాఖ నుంచి బయలుదేరి.. సాయంత్రం 4.50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రిటర్న్‌ డైరెక‌్షన్‌లో 2207 నంబర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 22071 నంబర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. ఉదయం 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. రిటర్న్‌ డైరెక్షన్‌లో ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 22702 నంబర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

మరిన్ని వార్తలు