‘వర్మను వెంటనే అరెస్ట్‌ చేయకపోతే..’

6 Mar, 2018 17:07 IST|Sakshi
సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ

సాక్షి, విశాఖపట్నం: వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను వెంటనే అరెస్ట్‌ చేయాలని విశాఖ‌ మ‌హిళాసంఘాల ఐక్య‌వేదిక డిమాండ్‌ చేసింది. మంగళవారం ఈ మేరకు న‌గ‌ర జాయింట్ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేసింది. ఆడ‌వాళ్ల‌ను అంగ‌డి స‌రుకుగా చేసి త‌న వ్యాపారంగా మార్చుకుంటున్నాడ‌ని మహిళా సంఘాల నేతలు దుయ్య‌బ‌ట్టారు. స‌మాజంపై చెడు ప్ర‌భావం చూపే వికృత దుర్మార్గపు ఆలోచ‌న‌ల‌ను ప్ర‌చారం చేస్తూ యువ‌త‌ను పెడ‌తోవ ప‌ట్టిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా విశాఖ‌లో స‌భ ఏర్పాటు చేస్తాన‌ని రాంగోపాల్‌వర్మ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని, ఇక్క‌డ‌కు వ‌స్తే త‌ప్ప‌కుండా ఆయనను అడ్డుకుంటామ‌ని హెచ్చరించారు. తక్షణమే రాంగోపాల్ వ‌ర్మ‌ను అరెస్టు చేయాల‌ని, లేని ప‌క్షంలో మ‌హిళా సంఘాలన్నీ ఏక‌మై ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని తెలిపారు.

మరిన్ని వార్తలు