ఆ రోజున అవతరణ దినోత్సవం చేస్తారా?

2 Nov, 2014 14:59 IST|Sakshi
చేగొండి హరిరామజోగయ్య(ఫైల్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ మార్చడాన్ని పలువురు నేతలు ఖండించారు. నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినంగా కొనసాగించాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘం నేత నాగిరెడ్డి, విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు.

సీమాంధ్ర ప్రజలు బాధతో ఉన్న రోజును ఏపీ అవతరణ దినోత్సంగా ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 13 జిల్లాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిపించాలని సూచించారు. జూన్ రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ అవరతరణ దినంగా పాటించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు