'విశాఖ హెచ్ పీసీఎల్ ప్రమాదం: పరిస్థితి అదుపులోనే ఉంది'

23 Aug, 2013 20:08 IST|Sakshi
విశాఖపట్నం హెచ్ పీసీఎల్ రిఫైనరీలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా పేలుడు జరిగింది అని ప్రత్యక్షసాక్షి వెల్లడించాడు. ప్రమాద సమయంలో కూలింగ్‌ టవర్‌ నిర్మాణం జరుగుతోంది అని తెలిపారు. టవర్‌పై నలుగురు కార్మికులు, కింద 30మంది వరకు పనిచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షి వివరించారు. మంటలు చెలరేగి 30 మందికి పైగా కాలిపోయారని ప్రత్యక్షసాక్షి తెలిపారు. 
 
ఈ పేలుడులో ఒకరి మృతి, మరొకరు ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాలతో  39మంది చికిత్సపొందుతున్నారని, ప్రస్తుతం హెచ్ పీసీఎల్ లో పరిస్థితి అదుపులోనే ఉంది హెచ్‌పీసీఎల్‌ జీ ఎం రమణన్‌ మీడియాకు వెల్లడించారు. 
 
మరిన్ని వార్తలు