యువతకు వివేకానందుడు ఆదర్శం

14 Oct, 2013 02:59 IST|Sakshi

దేవరకద్ర, న్యూస్‌లైన్: యువతకు ఆదర్శంగా నిలిచిన గొ ప్ప వ్యక్తి వివేకానందుడని, ఆయన ఆశ య సాధనకు యువ త ముందుకు రావాలని హైదరాబాద్ రా మకృష్ణ మఠం ప్రతినిధి స్వామి శిథికంఠనంద మహారాజ్ పిలుపు నిచ్చారు. వివేకానందుని 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న రథయాత్ర ఆదివారం దేవరకద్రకు చేరుకున్నది. వివేకానందుని రథయాత్ర ఊరేగింపు పట్టణంలో నిర్వహించిన అనంతరం స్థానిక శ్రీనివాస గార్డెన్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. యువత వివేకానందుడి ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దే శభక్తితో పాటు మన సంస్కృతిని కాపాడేందుకు కట్టుబడి ఉండాలని కోరారు. వివేకానందుని జీవితచరిత్రను ప్రతి ఒక్కరూ చద వడంతో పాటు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను దేశం కోసం, సమాజం కోసం వినియోగించాలని కోరారు.
 
 మంచి మార్గంలో నడుస్తూ యువత సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అంతకుముందు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వామి శిథికంఠనంద మహారాజ్‌ను పలువురు పుర ప్రముఖులు సన్మానించారు. సమావేశంలో రథయాత్ర జిల్లా ఇన్‌చార్జి రాజమల్లేశ్, యూత్‌ఫర్‌సేవా ప్రతినిధి చైతన్యరెడ్డి, సర్పంచ్ శోభా, రాందాసు, కరణం రాజు, రాందేవ్‌రెడ్డి, యజ్ఞభూపాల్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్, జట్టినర్సింహా రెడ్డి, కొండశ్రీనివాసరెడ్డి, చంద్రయ్య, నర్వ శ్రీనివాసరెడ్డి,సుధాకర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి,  తదితరులు పాల్గోన్నారు.
 

మరిన్ని వార్తలు