ఉక్కు పిడుగు

18 Dec, 2013 02:32 IST|Sakshi
ఉక్కు పిడుగు

 =క్రికెట్ సంచలనం..శ్రీరామ్
 =బాల్యంలో బ్యాడ్మింటన్ చాంప్
 =రంజీల్లో పరుగుల వర్షం
 =విశాఖ నుంచి మరో క్రికెట్ స్టార్

 
ఉక్కునగరం, న్యూస్‌లైన్: విశాఖకు చెందిన ఎం.యు.బి.శ్రీరామ్‌కు చిన్నప్పటి నుంచి ఆటలంటే  ప్రాణం. చదువులో ప్రతి భ కనబరుస్తూనే ఆటల్లో రాణించాడు. స్టీల్‌ప్లాంట్ జనరల్ ఆస్ప త్రి సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రావణకుమార్, డాక్టర్ సీతాదేవిల కుమారుడైన శ్రీరామ్ స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 96 శాతంతో ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు పొంది, బ్యాడ్మింటన్‌లో రాణిం చాడు. 11ఏళ్లకే 2002లో చెన్నైలో జరిగిన అండర్-10 కేటగి రీలోని శ్రీమతి కృష్ణఖైతాన్ మెమోరియల్ ఆలిండియా బ్యాడ్మిం టన్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ఆ తర్వాత 2004లో క్రికెట్ శిక్షణ ప్రారంభించి అదే ఏడాదిలో జిల్లా, రాష్ట్ర జట్లకు ఎంపికయ్యాడు. 2004-05లో అండర్-13 సౌత్‌జోన్ టోర్నమెంట్‌లో కేరళపై జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా 221 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే టోర్నమెంట్‌లో కర్ణాటకపై సెంచరీ చేసి మొత్తం ఐదు మ్యాచ్‌లో 453 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారునిగా అందరి దృష్టి ఆకర్షించాడు. 2005-06లో జరిగిన అండర్-13 సౌత్‌జోన్ టోర్నమెంట్‌లో తమిళనాడుపై 303 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో పాటు గోవా, హైదరాబాద్‌లపై సెంచరీలు సాధించి ఆ టోర్నమెంట్‌లో 554 పరుగులు చేసి ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికయ్యాడు. అప్పట్నుంచి అండర్-15, అండర్-16, అండర్-17, అండర్-19ల్లో శ్రీరామ్ జైత్రయాత్ర కొనసాగుతుంది.
 
ఏపీ అండర్-19 జట్టుకు 2011-12లో  కెప్టెన్‌గా నియమితులయ్యాడు. 2009లో సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నమెంట్ (రంజీ వన్డే)లో పాల్గొని పిన్న వయస్సు గల క్రీడాకారునిగా ఖ్యాతిగాంచాడు. 2012లో బాగా రాణించి రెండు సెంచరీలు చేయడంతో ఆంధ్రా తరపున రంజీ టీమ్‌కు ఎంపిక చేశారు. రెండువారాల క్రితం విశాఖలో ఢిల్లీ మీద జరిగిన అండర్-25 టోర్నమెంట్‌లో మొదటి ఇన్సింగ్‌లో 53 పరుగులు చేయగా, రెండో ఇన్సింగ్‌లో 103 బంతుల్లో 146 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించాడు.

ఈ సీజన్‌లో జరిగిన ఆరు రంజీ మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన శ్రీరామ్ కేరళపై జరిగిన మ్యాచ్‌లో 83 పరుగులు చేశాడు. మంగళవారం విశాఖ స్టేడియంలో హిమాచల్‌ప్రదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్సింగ్‌లో 43పరుగులు చేయగా, రెండో ఇన్సింగ్‌లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గీతంలో ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న శ్రీరామ్ చదువులో ప్రతిభ చూపుతూ కర్ణాటక సంగీతంలో కూడా పారవీణ్యం సాధించాడు.
 

మరిన్ని వార్తలు