తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’

3 Jun, 2020 09:09 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : నిసర్గ తుఫాను బుధవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర మహారాష్ట్ర వైపు గంటకు 12కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. అలీబాగ్‌కు దక్షిణ నైరుతి దిశగా 140 కి.మీ, ముంబైకి 190 కి.మీ, సూరత్‌కు 415 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌కు ఆనుకుని హరిహరేశ్వర్-దామన్ మద్య అలీబాగ్‌కు సమీపంలో నిసర్గ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. నిసర్గ తుఫాను ప్రభావం కారణంగా కొంకణ తీరం మొత్తం దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన ఇన్‌శాట్‌ త్రీడీ చిత్రాన్ని భారత వాతావరణ శాఖ తమ ట్విటర్‌ ఖాతాలో విడుదల చేసింది.   ( నిసర్గ‌‌ ఎఫెక్ట్‌: క‌రోనా పేషెంట్ల త‌ర‌లింపు )

భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఇన్‌శాట్‌ త్రీడీ చిత్రం

కాగా, గుజరాత్‌, మహారాష్ట్రలపై నిసర్గ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నారు.  గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్‌సారీ, భరూచి జిల్లాల్లోని తీరప్రాంతాల్లో నివసించే 78,971 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. నిసర్గ తుపాను తాకిడిని తట్టుకునేందుకు రాష్ట్రంలో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. తుపాను 16 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ యూనిట్లలో 10 బృందాలు తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఇంకా 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ( దూసుకొస్తున్న మరో తుపాను )

మరిన్ని వార్తలు