ఎస్పీగా దామోదర్‌ బాధ్యతలు స్వీకరణ

10 Feb, 2019 11:16 IST|Sakshi
ఎస్పీకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న విశాఖ రేంజ్‌ డీఐజీ పాలరాజు

విజయనగరం టౌన్‌: జిల్లా ఎస్పీగా ఏఆర్‌ దామోదర్‌ శనివారం బాధ్యతలు స్వీకరిం చారు. విజయనగరం పోలీస్‌ కార్యాలయం ఆవరణలో విశాఖ రేంజ్‌ డీఐజీ జి.పాలరాజు నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను జిల్లాలో శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌ శాఖకు ప్రజలు, మీడియా సహకరించాలని కోరారు. గతంలో తను విశాఖ రూరల్‌ ఓఎస్‌డీగా పనిచేశానని, ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు.

జిల్లాలో ఉత్సాహవంతులైన యువకులైన పోలీస్‌ అధికారులున్నారని, వారితో గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉందన్నారు. జిల్లాలో ఎటువంటి మావోయిస్ట్‌ కార్యకలాపాలు గత మూడేళ్లుగా జరగలేదని, ఎటువంటి కేసులు నమోదుకాలేదన్నారు. నేరాలు నమోదయ్యే రేటు ఇతర జిల్లాల కంటే తక్కువగానే ఉందని, కేసులను తను ఒకసారి సమీక్షించి, వాటి సంఖ్యను, నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్లను మరింతగా తగ్గించేందుకు కృషిచేస్తానని తెలిపారు. జిల్లా ఎస్పీగా పనిచేసి, విశాఖ రేంజ్‌ డీఐజీగా ఉన్న పాలరాజు పర్యవేక్షణలో ప్రజలకు పోలీస్‌ శాఖను మరింత  చేరువ చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లాలో ప్రధానంగా నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
అభినందనలు వెల్లువ
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దామోదర్‌కు  విశాఖ రేంజ్‌ డీఐజీ పాలరాజు పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. అనంతరం ఏఎస్పీ ఎం.నరసింహరావు, ఒఎస్‌డీ జె.రామ్మోహనరావు, బొబ్బిలి ఏఎస్పీ గౌతమీశాలి, పార్వతీపురం ఏఎస్పీ సుమిత్‌ గరుడ, విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రావణ్‌కుమార్, ఎస్‌బీ డీఎస్పీ  సి.మురళీనాయుడు, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ సెల్‌–2 డీఎస్పీ గురుమూర్తి, సీసీఎస్‌ డీఎస్పీ పాపారావు, ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి,  సీఐలు జి.రామకృష్ణ, వై.వి.శేషు,  రంగనాథం, మోహనరావు, రాంబాబు, ఆర్‌.శ్రీనివాసరావు, రాజులనాయుడు, ఆర్‌ఐలు శ్రీహరిరావు, రామకృష్ణ, రమేష్, శంకరరావు, కమ్యూనికేషన్‌ సీఐ రమణమూర్తి, ఇతర పోలీస్‌ అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. 

పైడితల్లిని దర్శించుకున్న ఎస్పీ
జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌ ముం దుగా స్థానిక మూడులాంతర్లు వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారిని దర్శిం చుకున్నారు. ఆలయ ఈఓ టి.అన్నపూర్ణ ఆలయ సంప్రదాయం ప్రకా రం స్వాగతం పలికారు. అమ్మవారి కి పసుపు, కుంకుమలతో పూజలు చేయించా రు.  అనంతరం  వేదపండితులు దూసి కృష్ణమూర్తి, శంబరి శంకరంలు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ రామారావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు