2051 లక్ష్యంగా వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక

2 Jan, 2020 13:38 IST|Sakshi

విశాఖలో వీఎంఆర్‌డీఏ స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశం

సాక్షి, విశాఖపట్నం: 2051 లక్ష్యంగా దృక్పథ ప్రణాళిక సిద్ధం చేయడానికి విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కసరత్తు ప్రారంభించింది. గురువారం నిర్వహించిన వీఎంఆర్‌డీఏ స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ,అవంతి శ్రీనివాస్‌, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు రమణమూర్తి రాజు,నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన, విశాఖ నార్త్ కన్వీనర్ కె రాజు పాల్గొన్నారు. వీఎంఆర్‌డీఏ పరిధిలో సూక్ష్మస్థాయి నుంచి పరిశీలన చేసి అభివృద్ధి చేయడంతో పాటు పాలసీ ఫ్రేమ్‌ వర్క్‌పై దృష్టి పెట్టానున్నారు.

దృక్ఫథ ప్రణాళిక రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. మూడు రీజియన్‌ల ఫీడ్‌బ్యాక్‌తో ఆర్థిక వృద్ధికి పెద్దపీట,రాష్ట్ర విధానాలకు అనుగుణమైన నిర్మాణాత్మక ప్రణాళిక, సీఆర్‌జెడ్‌ రెగ్యులేషన్స్‌ పరిధిలో రెజీలియంట్‌ టెక్నాలజీలపై సమావేశంలో చర్చించారు. భావనపాడు,నక్కపల్లి, భీమిలిపట్నంలో వచ్చే గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులపై సమావేశంలో ప్రస్తావన కొచ్చాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి నిర్మాణాత్మకమైన సలహాలను, సూచనలను వీఎంఆర్‌డీఏ స్వీకరించింది.

మరిన్ని వార్తలు