విశాఖపట్నం : మీ ఓటు చెక్‌ చేసుకొండి ..

11 Mar, 2019 12:29 IST|Sakshi

నేను నా పేరు ఓటరు లిస్టులో ఉందో లేదో చెక్‌ చేసుకున్నాను.

హైదరాబాద్‌లో ఉన్న నా ఓటును విశాఖకు మార్చుకున్నాను.

– జె.సృజన,జాయింట్‌ కలెక్టర్,విశాఖపట్నం

  • నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
  • 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
  • www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే Search Your name  పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
  • కలెక్టరేట్‌లోని కాల్‌ సెంటర్‌ ల్యాండ్‌ లైన్‌ నెం : 0891–2534426
  • కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి : కే.పద్మ, పీడీ, డ్వామా : 9490914671
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు.
  • మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
  • ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. 
మరిన్ని వార్తలు