ఓటున్నా.. కార్డు లేదన్నా!

27 Feb, 2014 03:42 IST|Sakshi
ఓటున్నా.. కార్డు లేదన్నా!

పాలమూరు,  జిల్లాలో చాలామందికి ఓటరు కార్డులేదు. కొత్తగా నమోదుచేసుకున్న వారికి కార్డులు అందనేలే దు. ఇస్తారా? లేదా? అనే విషయం కూ డా అయోమయంగా ఉంది.

 

కొత్త ఓట ర్లకు మీసేవ కేంద్రాల ద్వారా ఓటరు గు ర్తింపు కార్డులను వెంటనే పంపిణీచేస్తామ ని చెబుతున్నా ఆచరణలో అమలుకావ డం లేదు. చాలామందికి ఈ కార్డులు ఎ క్కడ తీసుకోవాలన్న దానిపై అవగాహన లేదు. జిల్లాలో కొత్తగా నమోదైన రెండు ల లక్షల కార్డులను అందజేయాల్సి ఉం ది. ఇందుకు సంబంధించిన కార్డులు పం పినట్లు ఎన్నికల సంఘం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో ఆమేరకు పంపిణీ జరగలేదు. ఓ వైపు కార్డులు రాకపోవడం.. వ చ్చిన వాటిని కూడా తీసుకెళ్లేందుకు ఓట ర్లు ఉత్సాహం చూపకపోవడం, మరోవై పు గుర్తింపు కార్డులు మీ-సేవ కేంద్రాల కు తక్కువ సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల పదులసంఖ్యలో నే కార్డులు అందజేసినట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఆఖరి క్షణాల్లో గుర్తింపు కార్డుల కోసం ఓటర్లు మీ-సేవ కేంద్రాల వద్ద బారులుతీరే పరిస్థితి తప్పదు.
 

 

ఇతర సేవల్లోనూ అంతే..

 

 ధ్రువపత్రాల జారీలో దళారుల వ్యవస్థ దూరం చేయాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటుచేసింది. కా నీ క్షేత్రస్థాయిలో వాటి పనితీరు సక్రమం గా లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బం దులు పడుతున్నారు. జిల్లాలో దాదాపు 248 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందు లో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. దేవరకద్ర మండలం మొత్తానికీ ఒకటే మీ సేవ కేంద్రం ఉంది. కొత్తకోటలో నాలుగు కేంద్రాలు ఉన్నా యి. షాద్‌నగర్‌లో ఇప్పటికే ఐదు కేంద్రాలుండగా మరో అయిదింటికి అనుమతిం చారు.

 

 

బొంరాస్‌పేటలో రెండు ఇలా.. ప లు మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే అధిక మొత్తంలో మీసేవ కేంద్రాల ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్నారు. 15 నుంచి 20 కిలోమీట ర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ లు, మేజర్ గ్రామ పంచాయతీల్లో మా త్రం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంటే.. కేం ద్రాలున్న చోట మాత్రం ధ్రువీకరణ ప త్రాల అందజేయడంలో తీవ్ర జాప్యంనెలకొంది. లబ్ధిదారులు మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది.

 

ఆన్‌లైన్ సర్వర్‌డౌన్ సమస్యతో ప్రతిరోజు గంటల తరబడి మీసేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోతున్నాయి. సర్వర్ డౌన్‌లోడ్ అవుతుందని కేంద్రం నిర్వాహకులు పలుమార్లు తిప్పుకుంటున్నారు. మరికొందరు ప్రింటర్ లేదని మళ్లీ రావాలనే సాకులను చెబుతూ లబ్ధిదారులను వేధిస్తున్నట్లు సమాచారం. ఆర్థికభారంతో పాటు పలుమార్లు కేంద్రం చుట్టూ తిప్పడంతో చాలా మంది విసిగిపోతున్నారు.
 
 

మరిన్ని వార్తలు