‘నిర్భయంగా ఓటు వేయండి’

20 Mar, 2019 10:48 IST|Sakshi
ఓటర్ల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ విశాల్‌గున్నీ  

సాక్షి, జగ్గంపేట: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విశాల్‌ గున్నీ అన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం ఓటర్ల అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన కాట్రావులపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌ 11న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు పాత కేసులు, నాన్‌ బైయిలబుల్‌ వారెంట్లు ఉన్న నిందితులు ఐదు వేల మందిని బైండోవరు చేశామన్నారు. 22 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు రూ.కోటి స్వాధీనం చేసుకున్నామన్నారు.

జిల్లా సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ బలగాలు వచ్చాయని, అదనంగా మరో ఆరు వేల ఫోర్సును కోరామన్నారు. ఏజన్సీలో 372 పోలింగ్‌ కేంద్రాల్లో సజావుగా ఎన్నికలు జరిగేలా చూస్తున్నామన్నారు. చత్తీస్‌ఘడ్, ఒడిశా సరిహద్దులో నిఘా ఉంచామన్నారు. మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన, అసాంఘిక కార్యక్రమాలను ఎక్కడైనా జరిగితే వెంటనే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సీ విజల్‌ యాప్‌ ద్వారా  ఫిర్యాదులు చేయాలని కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ రామారావు, సీఐ రాంబాబు, ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు