ఓటరు నమోదుపై దృష్టి

12 Dec, 2013 03:43 IST|Sakshi

 విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్ కాంతిలా ల్ దండే ఎంపీడీఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి నూరు శాతం ఫోటోతో కూడిన ఓటరు జాబితా ప్రచురణకు కృషి చేయాలన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డివిజన్ అధికారుల తో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్‌ఓలు అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బీఎల్‌ఓలు ఎక్కడ ఉంటారన్న సమాచారం లేదని... అటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ ప్రతీ రోజూ పోలింగ్ స్టేషన్ల ఆవరణలో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
 
 విచారణ జరపండి..
 ఓట్ల తొలగింపు సమయంలో నివసించిన వారి ఓట్లు తొల గించినప్పుడు తప్పనిసరిగా సమాచారం అందించాలన్నా రు. ఎస్.కోటలో ఎటువంటి విచారణ లేకుండా 14 ఓట్లు తొలగించటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటూ విచారణ జరిపించాలని ఆర్‌డీఓ వెంకటరావును ఆదేశించారు.  వివాహితుల ఓటర్ల చేర్పులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదే శించారు. ఓటరు కార్డులో సవరణలు కోసం దరఖాస్తులు చేస్తున్నప్పటికీ అవి నమోదు కావటం లేదని ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
 
 తాగునీటి పధకాలపై దృష్టి..
 ప్రజల అవసరాల కోసం అమలు చేస్తున్న తాగునీటి పథకాలు త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మండలాల వారీ  పథకాలు వాటి పరిస్థితిపై సమీక్షించారు. డివిజన్‌లో ప్రారంభం కాని 16 పనులను తక్షణమే ప్రారంభించాలని ఎస్‌ఇ మెహర్‌ప్రసాద్‌ను ఆదేశించారు. ఎక్కడైనా స్థలం లేక ప్రాజెక్టులు రద్దు చేస్తే తప్పనిసరిగా సంబంధిత మండల ఎంపీడీఓల నుంచి ధ్రువీకరణ  పత్రాలు తీసుకోవాలన్నా రు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీలకు తాగునీటి సదుపా యం ఉన్నది లేనిది పర్యవేక్షించాలన్నారు.
 

మరిన్ని వార్తలు