ఓటరు నమోదుకు నేడే తుది గడువు

9 Mar, 2014 02:09 IST|Sakshi

 ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం చివరి అవకాశం కల్పించింది. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని 2,990 పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవల్ అధికారులు ఓటరు దరఖాస్తు ఫారాలతో అందుబాటులో ఉండనున్నారు. వీరివద్ద తాజాగా(31-01-2014) సవరించిన ఓటర్ల జాబితా ఉంటుంది.

ఇందులో పేరున్నది... లేనిది... ఓ సారి సరిచూసుకుంటే ఎన్నికల రోజు ఏ టెన్షన్ లేకుండా ఓటేయొచ్చు. జాబితాలో  మీపేరు తప్పుగా ఉన్నా... ఫొటో వేరే వారిది ఉన్నా.... మీ చిరునామాలో మార్పులున్నా...  బూత్ లెవల్ అధికారి వద్ద ఉన్న ఫారం పూరి ్తచేసి వారికే ఇస్తే సరిపోతుంది. పోలింగ్‌కు ముందే అధికారికంగా ప్రకటించే ఓటర్ల జాబితాలో మీ పేరుంటుంది. ఫొటో గుర్తింపు కార్డు కూడా పొందే వీలుంటుంది.
 

 తర్వాత చేస్తే...
 ప్రస్తుతం ఎన్నికల ప్రకటన విడుదల సమయంలో ఎన్నికల సంఘం చెప్పినట్లు నామినేషన్లు వేసే ముందు రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పులూ సవరించుకోవచ్చు. అరుుతే వారి పేరు జాబితాలో కాకుండా... అదనపు జాబితాలో చేరుస్తారు. ఆ జాబితాలో వారి పేరు మాత్రమే ఉంటుంది. ఫొటో ఉండే అవకాశం తక్కువ. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే... ఆదివారం ఆయూ పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్‌ఓ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం.  
 

 ఏ ఫారం ఎందుకంటే...
     ఫారం-6 : కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారు ఫారం-6 పూర్తి చేయూలి. దీంతోపాటు మీ చిరునామా రుజువు కోసం కరెంటు బిల్లు, రేషన్‌కార్డు, ఇంటి పన్ను రసీదులలో ఏదేని ఒకదాన్ని జతచేయూలి. వీటితోపాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఫారానికి అతికించాలి. సంతకం తప్పనిసరిగా చేయాలి. 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు వయసు ధ్రువీకరణ నిమిత్తం ఎస్సెస్సీ మెమో జీరాక్స్ జతచేయాలి. ఫారంలో మీ సెల్ నంబర్ రాస్తే సమాచారం కోసం ఉపయోగపడుతుంది.
     ఫారం-7 :  జాబితాలోంచి పేరు తొలగించడానికి ఇది ఉపయోగ పడుతుంది. జాబితాలో మీ పేరు రెండు చోట్ల ఉన్నా... ప్రస్తుతం ఉన్నచోట తొలగించాలన్నా.. ఫారం-7 పూర్తి చేసి ఇవ్వాలి. దరఖాస్తు పూర్తిగా నింపి సంతకం చేయాలి. తొలగింపుకోసం ఓటరు స్వయంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
   

 ఫారం-8 :  సవరణల కోసం ఇది ఉపయోగ పడుతుంది. జాబితాలో అక్షర దోషాలు, చిరునామా తప్పుగా ఉన్నా...  ఫొటో పాతదిగా ఉన్నా... మీ ఫొటో ఉండాల్సిన చోట ఇతరుల ఫొటో ఉన్నా... ఫారం-8 పూర్తి చేసి, ఇందుకు అవసరమైన రుజువులు జతచేసి అధికారులకు అందజేయాలి.
     

ఫారం-8(ఏ) : ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజక వర్గానికి పేరు మార్చుకోవడానికి ఫారం-8(ఏ)ని పూర్తి చేసి ఇవ్వాలి. ఓటర్ల జాబితాలో మీ పేరు ఏ నియోజక వర్గంలో ఉన్నది తెలియజేయాలి. అలా చేస్తే పాతచోట తొలగించి మీరు కోరుకున్న కొత్త నియోజక వర్గంో జాబితాలో మీ పేరు చేర్చుతారు.
 

ఆన్‌లైన్ దరఖాస్తు ఇలా...
 అధికారుల వద్ద దరఖాస్తులు తీసుకుని పూర్తిచేసి ఇవ్వకుండా నేరుగా ఇంట్లోంచి కూడా ఆన్‌లైన్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఇంటర్‌నెట్‌లో ఠీఠీఠీ.ఛిౌ్ఛ్చఛీజిట్చ.జీఛి.జీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. ఫారం-6 సెలెక్ట్ చేసుకుని పూర్తిచేసి ఒక కలర్ ఫొటోను బ్రౌజ్ చేయాలి. ఫారంలో పూర్తి వివరాలు... పేరు, ఇంటి నంబర్, తండ్రి పేరు. వయసుతో పాటు సెల్ నంబర్ తప్పనిసరి.
 

ఓటర్ల నమోదు సమాచారం కోసం...
 ఓటర్ల నమోదుకు సంబంధించిన సమాచారం కోసం కలెక్టరేట్‌లోని టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 18004252747 నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చు.


 ఎన్నికల కమిషన్ టోల్‌ఫ్రీ నంబర్ 1950కు ఉదయం10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. జిల్లాలోని అన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫారాలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు