ఎస్ఐ కొట్టారని ఎన్నికల బహిష్కరణ

11 Apr, 2014 11:44 IST|Sakshi

విజయనగరం జిల్లా గజపతినగరంలో మండలం జిన్నాంలో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైల్వే ఉద్యోగిపై స్థానిక ఎస్.ఐ దాడి చేశారు. ఆ కారణంగా ఎందుకు దాడి చేశారంటూ రైల్వే ఉద్యోగి ఎస్.ఐను ప్రశ్నించారు. అంతే సదరు ఎస్.ఐ ఆగ్రహంతో ఉగిపోతూ... నన్నే ప్రశిస్తావా అంటూ ఉద్యోగిపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో ఎస్.ఐ, రైల్వే ఉద్యోగి మధ్య తోపులాట చోటు చేసుకుంది.

 

ఆ క్రమంలో ఎస్.ఐ డ్రెస్కు ఉండే స్టార్ పడిపోయింది. దాంతో రైల్వే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆ తతంగమంతా చూస్తున్న స్థానిక ఓటర్లు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్వే ఉద్యోగిని వదిలిపెట్టాలని స్థానికులు పోలీసులు డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు ససేమిరా అనడంతో... పోలింగ్ కేంద్రం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఉద్యోగిని వదిలి పెట్టేంతవరకు పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు