కామాంధుడు

7 Dec, 2014 06:55 IST|Sakshi

మహిళపై వీఆర్వో లైంగింక వేధింపులు
7వేలు తీసుకుని పాసుబుక్కు ఇచ్చాడు
టైటిల్‌డీడ్ అడిగితే  కోరిక తీర్చమన్నాడు
’సాక్షి’ని ఆశ్ర రుుంచిన బాధితురాలు
 దెబ్బలుతిని పరుగు లంఘించిన వైనం

 
కుప్పం :పట్టాదారు పాసుబుక్కు ఇవ్వమని అడిగితే తన కోరిక తీర్చమంటూ ఓ మహిళను వీఆర్‌వో వేధించాడు. * 7 వేలు తీసుకుని పట్టాదారు పాసుబుక్కు మాత్రమే ఇచ్చిన అతడు టైటిల్ డీడ్ ఇవ్వాలంటే మాత్రం కచ్చితంగా కోరిక తీర్చాల్సిందేనంటూ డిమాండ్  పెట్టాడు. బాధితురాలు న్యాయం కోసం ‘సాక్షి’ని ఆశ్రయించింది. బరితెగించి బాధితురాలి ఇంటికే వెళ్లిన అతనికి ఆమెతోపాటు బంధువు కలిసి దేహశుద్ధి చేశారు. దెబ్బలకు తాళలేక మోటార్‌బైక్‌ను సైతం అక్కడే వదిలేసి అతడు పరుగులు పెట్టాడు. కుప్పంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు, ఆమె బంధువుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే....కుప్పం మండలం ఎర్రగుట్టచేనుకు చెందిన ఓ మహిళకు ఇద్దరు పిల్లలు. ఆమెకు అడవిబూదుగురు రెవెన్యూ గ్రావుంలోని సర్వే నెంబరు 33-3 బిలో 0.45 సెంట్లు,33-1బి లో 72 సెంట్ల భూమి ఉంది. భర్తతో తెగతెంపులు చేసుకున్న ఆమె మూడేళ్లుగా వేరుగా కాపురం ఉంటోంది. కొంతకాలంగా కుమారుడికి అనారోగ్యంగా ఉండడంతో బ్యాంకు లోన్ తీసుకుని బిడ్డను కాపాడుకునేందుకు  తన భూమికి సంబంధించిన పట్టాదారు పాసుబుక్కు కోసం వీఆర్‌ఓను సంప్రదించింది. అదిగో ఆదిగో అంటూ  ఆరు నెలలపాటు అతడు పాసుబుక్కు ఇవ్వలేదు.

మూడు నెలల క్రితం డబ్బులు కావాలని డిమాండ్  చేశాడు. కమ్మలు అమ్మి  ’ 7 వేలు  ఇచ్చింది. ఆ తరువాత 2014 సెప్టెంబర్ 24న అతడు పట్టాదారు పాసుబుక్కు మాత్రమే ఇచ్చాడు. దాన్ని తీసుకుని ఆమె రుణం కోసం స్టేట్ బ్యాంకుకు వెళ్లింది. టైటిల్ డీడ్ బుక్కు కూడా తీసుకురావాలని బ్యాంకువారు చెప్పడంతో ఆమె ఆ బుక్కుకోసం తిరిగి అతడిని సంప్రదించింది. ఆ బుక్కు ఇవ్వాలంటే అతని కోరిక తీర్చాలని డిమాండ్ పెట్టాడు. ఏమీ పాలుపోని ఆమె శ్రేయోభిలాషుల సలహాతో ‘సాక్షి’ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఆమె టైటిల్‌డీడ్ బుక్కు అడగడంతో అతడు శనివారం ఉదయుం కోరిక తీర్చమంటూ ఆమె ఇంటికెళ్లాడు. బాధితురాలితోపాటు ఆమె మామ కలిసి అతడిని చితకబాదారు. వారిదెబ్బలకు తాళలేకపోవడమేగాక.. అక్కడే విలేకరి ఉన్నాడని తెలుసుకున్న అతడు మోటార్ బైక్‌ను సైతం వదిలేసి పరుగున పారిపోయూడు.
 
 

మరిన్ని వార్తలు