దశాబ్దానికిపైగా తిష్ట 

15 Jul, 2019 11:11 IST|Sakshi

ఎటు వెళ్లినా తిరిగి అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయానికే

చక్రం తిప్పుతున్న కొందరు వీఆర్‌ఓలు

వీరికి అండగా ఓ అధికారి

సాక్షి, అనంతపురం టౌన్‌: అనంతపురం రూరల్‌ మండలం చియ్యేడు రెవెన్యూ గ్రామ వీఆర్‌ఓ  10ఏళ్లుగా అనంతపురం తహసీల్దారు కార్యాలయంలోనే పనిచేస్తున్నాడు. సాధారణ బ దిలీల సందర్భంలో బదిలీ అయినా తిరిగి యథాస్థానంలో ఉండేలా చక్రం తిప్పుతున్నాడు. చియ్యేడు నుంచి ఏ నారాయణపురానికి బదిలీ చేయించుకొని తిరిగి అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. మరో ఐదేళ్లు ఆయన నిశ్చింతంగా ఇక్కడే పనిచేస్తాడు. తన సర్వీస్‌లో దాదాపు 15 ఏళ్లు ఇక్కడే పనిచేస్తున్నాడంటే ఆయన సత్తా ఏమిటో తెలుస్తోంది. ఓ వీఆర్‌ఓ 2008నుంచి ఇప్పటి వరకు అనంతపురం తహసీల్దారు కార్యాలయ పరిధిలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ప్ర స్తుతం అర్బన్‌లో మూడవ వార్డుకు వీఆర్‌ఓగా పని చేస్తున్నాడు. తాజా బదిల్లీలో 5వ వార్డుకు బదిలీ చేశారు. ఇతను ఇప్పటికే దాదాపు 11 ఏళ్లు సర్వీస్‌ అనంతపురం తహసీల్దారు కార్యాలయంలోనే పూర్తి చే శాడు. ఇప్పుడు మరో 5 ఏళ్ల పాటు ఇక్కడే కొనసాగనున్నాడు.  ఇలాంటి వీఆర్‌ఓలు అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో అనేక మంది ఉన్నారు.


వివరాల్లో కెళ్తే... అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయంలో అనేక మంది గ్రామ రెవెన్యూ అధికారులు కొన్నేళ్లుగా తిష్టవేసి వ్యవహారాలు చక్కబెడ్తున్నారు. సాధారణ బదిలీల సమయంలో వీరు కలెక్టరేట్‌లోని ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఆశ్రయిస్తారు.  బదిలీలు చేసినా  తిరిగి వారు యథాస్థానంలో ఉండేలా  ఆయన చక్రం తిప్పుతున్నారన్నది బహిరంగ రహస్యం.అనంతపురం త హసీల్దారు కార్యాలయంలో 25 మంది వీ ఆర్‌ఓలు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు 10 మందికి పైగా వీఆర్‌ఓలు కొ న్నేళ్లుగా ఇక్కడ పాతుకుపోయారు. ప్రతి బదిల్లీలోనూ అర్బన్‌ నుంచి రూరల్‌కు, రూరల్‌ నుంచి అర్బన్‌కు మారుతూ తమ సర్వీస్‌ మొత్తం  ఇక్కడే పూర్తి చేయనున్నారు.

వీఆర్‌ఓలపై ఆరోపణలు ఎన్నో:
ప్రభుత్వ భూములకు పట్టాలను జారీ చేయడంలో అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో పని చేస్తున్న కొందరు వీఆర్‌ఓలు సిద్ధహస్తులు. వీరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారు.  అయినా వీరిని బదిలీ చేయకపోవడం గమనార్హం.  అనంతపురం రూరల్‌ మండలం నగరానికి దగ్గరలో ఉంది.. దీంతో ఇక్కడి భూములకు మార్కెట్లో మంచి విలువ ఉంది. గతంలో అర్బన్‌లో పన చేస్తున్న ముగ్గరు వీఆర్‌ఓ దేవుని మాన్యానికే ఎసర పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. కొడిమి గ్రామంలోని 15 ఎకరాల ఆంజనేయస్వామి మాన్యాన్ని కాజేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతోపాటు పంచాయతీ ఓపెన్‌ స్థలాలకు సైతం డి.పట్టాలను మంజూరు చేశారు.  దీనిపై అప్పట్లోనే ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో విరమించుకున్నారు.  ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వీఆర్‌ఓలకు ఇకనైనా చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.

బదిలీ నిబంధనలు గాలికి
వీఆర్‌ఓల బదిలీల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని 5 సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసుకున్న వీఆర్‌ఓలను పనిచేసే చోటు నుంచి  మరో మండలానికి బదిలీ చేయాలి.  అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో కొందరు వీఆర్‌ఓలను  మాత్రమే ఇతర మండలాలకు బదిలీ చేశారు. అయితే 10 మందికిపైగా వీఆర్‌ఓలను అటు నుంచి ఇటు  మార్చి తహసీల్దారు కార్యాలయంలోనే ఉంచారు.  ఉదాహరణకు అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లి, ఆకుతోటపల్లిలో వీఆర్‌ఓలు 5 ఏళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్నారు. అయితే వీరిని మరో మండలానికి బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచారు.  

మరిన్ని వార్తలు