ఏడు నెలలుగా ఎదురుచూపులే!

21 May, 2016 08:54 IST|Sakshi

గత ఏడాది నవంబరు నెలలో సంభవించిన ‘రోవాను’ తుపాను జిల్లా ప్రజలను నిండా ముంచింది. ఆ తుపాను ధాటికి జిల్లా కకావికలం అయింది. రైతులు కుదేలయ్యారు. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో వ రద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, తుపాను సంభవించి ఏడునెలలైనా పరిహారం అందించలేదు. బాధితులకు బియ్యం, పంచదార, పామాయిలు ఇచ్చి చేతులు దులుపుకుంది.

 

చిత్తూరు:  రోవాను ధాటికి జిల్లా వ్యాప్తంగా 2,429 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. దీనిలో వేరుశనగ 167 హెక్టార్లు, వరి 1,790, కందులు 153 , ఇతర పంటలు 319 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. వీటికి మొత్తం రూ.27 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. భారీ వర్షాలతో  ఉద్యానవన పంటలు 3,164 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. దీనివల్ల 6,185 మంది రైతులు నష్టపోయారు. వీరికి  రూ.287.03 కోట్లు చెల్లించాల్సి ఉంది. బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం.చిత్తూరు, మదనపల్లి, తిరుపతి డివిజన్లలో రోవాను ధాటికి  9,738 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక ఉపశమనం కింద కంటి తుడుపు నగదు చెల్లించారు. తరువాత వాటిని పట్టించుకోలేదు.

 

పరిశీలనలే తప్ప పైసారాలేదు
తెలుగుగంగ కాలువకు తొట్టంబేడు వుండలంలోని పెద్దకనపర్తి, చిన్నకనపర్తి వద్ద వుూడుచోట్ల గండ్లు పడ్డారుు. దాంతో వెరుు్య ఎకరాల పంట నీట వుునిగింది. 300 ఎకరాలకు ఇసుక దిబ్బలు కట్టారుు. అందులో నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. మంత్రులతోపాటు స్థానిక నాయుకులు, అధికారులు పదేపదే గతేడాది నవంబర్‌లో  పరిశీలన చేశారు. అరుుతే ఇప్పటివరకు వూకు గానీ, వూ గ్రావూనికిగానీ పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు.           - ఈశ్వరయ్యు,

         
చిన్నకనపర్తి గ్రావుం,తొట్టంబేడు వుండలం గూడు కూలిపోయింది
గత ఏడాది నవంబర్‌లో కురిసిన వర్షాలకు ఉన్న గూడు కూలిపోయింది. అప్పటినుంచి తాత్కలికంగా పట్టలతో ఇల్లు నిర్మించుకుని అందులో ఉంటున్నాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అందులో ఉండలేక అవస్థలు పడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇళ్లు మంజూరు చేసిందని తెలిసింది. కానీ మాకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. పభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
-నేతాజీ,  బుడిగిపెంట యాదమరి మండలం

 
వర్షానికి ఇల్లుకూలి రోడ్డున పడ్డాం

మాది పాకాల మండలం దామలచెరువు పంచాయతీ కుక్కలపల్లి దళితవాడ. గత ఏడాది నవంబర్‌లో కురిసిన వర్షానికి ఇల్లు కూలి రోడ్డున పడ్డాం. ప్రస్తుతం బాడుగ ఇంట్లో తల దాచుకుంటున్నాం. వర్షానికి ఇళ్లు కూలిన వాళ్లకు ప్రభుత్వం సాయం చేస్తామని ప్రకటించింది.  అయితే 10 కేజీల బియ్యం, రూ. 5వేల రూపాయల నగదుతో సాయం అయిపోయిందని చేతులు దులిపేసుకుంది. ఇళ్లు పూర్తిగా కూలిపోయి రోడ్డున పడితే రూ.5వేలతో ఏవిధంగా ఇల్లు కట్టుకోవాలి.

- జీ.లక్ష్మీపతి, దామలచెరువు

మరిన్ని వార్తలు