తెలంగాణ ఉద్యమంలో ఉరుమై మెరిసిన ఓరుగల్లు

31 Jul, 2013 03:15 IST|Sakshi

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమ ఉప్పెనలో ఓరుగల్లు ఉరుమై మెరిసింది. దశాబ్దకాలం సాగిన పోరాటం లో జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు కీలపాత్ర పోషిం చారు. ప్రభుత్వ నిర్బంధం, అరెస్టులు, కేసులు, లాఠీచార్జ్‌లు ఎదుర్కొని రాష్ట్ర సాధన కోసం పోరా డారు. నాలుగుకోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ విద్యార్థులు, యువకులు 112 మంది ఆత్మ బలిదానానికి పాల్పడ్డారు. త్యా గాల సాళ్లల్లో ఉద్యమ విత్తనాలు నాటి అప్పటి పో రాట యోధుల వారసత్వాన్ని చాటారు.
 
 తెలంగాణ బీజాలు..
 2001 టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, భూపతి కృష్ణమూ ర్తి, కేయూ ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ఆకాంక్షను చాటిచెబుతూనే వచ్చారు. తెలంగాణ మహాసభ, జనసభ, ఐక్యవేదికలు తెలంగాణ భావవ్యాప్తికి పునాదులు వేశారు. అయితే 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ఆవిర్భావం అనంతరం ఓరుగల్లు జిల్లా గులాబీ పార్టీని అక్కున చేర్చుకుని  తెలంగాణ పోరు గొంతుకగా నిలిచింది.
 
 ఉద్యమ కెరటాలుగా విద్యార్థులు..
 ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చే శారు. ఇది ఉద్యమ నిప్పును రాజేసింది. కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ కెరట మై ఎగిసింది. జిల్లా అంతా అల్లకల్లోలమైంది. అనంతరం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకట న వచ్చింది. అయితే, విజయోత్సవాలకు సిద్ధమవుతుండగానే 23న తెలంగాణ వ్యతిరేక ప్రకటన వచ్చింది. ఇక జిల్లా మళ్లీ నిప్పుల కొలిమైంది.  అన్ని పార్టీలతో పాటు ఉద్యోగ, విద్యార్థి సంఘాలు భాగస్వామ్యమయ్యాయి. ఇదిలా ఉండగా, కేయూ విద్యార్థులు చేపట్టిన దీక్షలు జిల్లాలోని సకల సం ఘాలను, వర్గాలను, యూనియన్లను, తెలంగాణ వాదులను ఐక్యం చేసింది.
 
 సకల జనుల సమ్మె..
 శ్రీకృష్ణకమిటీ, అఖిలపక్షాల అనంతరం 2010 డిసెంబర్ 16న మహాగర్జన సభ చరిత్రలో నిలిచి పోయే స్థాయిలో నిర్వహించారు.  మరోసారి నిరసనలు, ర్యాలీలు, విద్యాసంస్థల బంద్‌లు, రైల్‌రోకో లు, వంటవార్పు ఒక్కటేమిటి సకల పోరు రూ పా లు ఆవిష్కృతమయ్యాయి. 52 రోజుల పాటు సా గిన సకల జనుల సమ్మెకు ముందుగా జిల్లాలోని బొగ్గుగని కార్మికులు సమ్మెకు సైరన్ ఊదారు. త ర్వాత ఆర్టీసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యుత్, వైద్య, ఆటో, కార్మిక కర్షకులు, వృత్తి సంఘాలు భా గస్వామవుతూ వచ్చారు.
 
 నేతలకు అడ్డంకులు..
 పాలకుర్తి పర్యటనకు వచ్చిన చంద్రబాబు, ముఖ్యమంత్రిగా తొలిసారిగా వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డికి రాయినిగూడెంలో.. ఇలా ప్రతీ నేతకు చేదు అనుభ వం తప్పలేదు. ఇక ఉద్యమ క్రమంలో వేలాది కేసు లు నమోదు కాగా, 1500 మంది జైలుకు వెళ్లివచ్చా రు. వీరందరూ ప్రస్తుతం తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

మరిన్ని వార్తలు