మేమూ నీవెంటే..

11 Sep, 2018 07:22 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలో చేరిన 6వ వార్డు మహిళలు

సాక్షి, విశాఖపట్నం: జననేత జగన్‌మోహన్‌రెడ్డి విధానాలకు ఆకర్షితులైన పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయన సమక్షంలో పార్టీతీర్థం పుచ్చుకునేందుకు నగరంలో జరిగిన ప్రజాసంకల్పయాత్రను   వేదికగా మలచుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం తాటిచెట్లపాలెం వద్ద బస చేసిన ప్రదేశంలో ఉత్తర నియోజకవర్గ పరిధి 35వ వార్డు సంజీవయ్య కాలనీకి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు జి.జగ్జీవనరావు, సిటీ కాంగ్రెస్‌ కార్యదర్శి ఎం. వీర రాఘవులు వైఎస్సార్‌సీపీలో చేరారు. మధ్యాహ్నం తూర్పు నియోజకవర్గం సిరిపురం బాలాజీ స్టాప్‌ వద్ద 6వ వార్డుకు చెందిన బి.శాంతి, చాందిని, అనిత, సుమిత్ర, కొండమ్మ తదితరులు పార్టీలో చేరారు. ఈ మహిళలంతా గతంలో పీఆర్పీలో పనిచేసినట్లు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డితోనే ప్రజాసంక్షేమం సాధ్యమని భావించి తాము పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.

మాజీ కార్పొరేటర్‌ దంపతుల చేరిక
ద్వారకానగర్‌: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ దల్లి లక్ష్మి, భర్త దల్లి రామకృష్ణ(మొండి రామకృష్ణ) తన బృందంతో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆశీలమెట్ట సంపత్‌ వినాయక ఆలయం వద్దకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వారికి జగన్‌ వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!

జన గర్జన