జగన్‌కు ఘన స్వాగతం

14 Nov, 2013 02:21 IST|Sakshi
మధురపూడి, న్యూస్‌లైన్ :గుండెలో దాచుకున్న అభిమాన నేత చాలాకాలం తర్వాత కనుల ముందు సాక్షాత్కరించడంతో వారిలో ప్రేమాభిమానాలు పెల్లుబికాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాకతో మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. బుధవారం మధురపూడి విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఉదయమే జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి వచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. మూడొంతుల మందిని విమానాశ్రయం వెలుపల ఆర్‌అండ్‌బీ రోడ్డుపైనే నిలిపేశా రు. 
 
 మధ్యాహ్నం 1.55 గంటలకు జెట్ ఎయిర్‌వే స్ విమానంలో జగన్‌మోహన్ రెడ్డి ఇక్కడకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనను చూడగానే అభిమానులు, నాయకులు పెద్దఎత్తున జయజయధ్వానాలు చేశారు. పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో స్వాగతం పలికారు. పేరుపేరునా పలకరించిన ఆయన ప్రత్యేక కాన్వాయ్‌లో రాజమండ్రి వెళ్లారు. పోలీసుల వైఫల్యం కారణంగా అభిమానులు, ప్రజలు ఆర్‌అండ్‌బీ రోడ్డుపై కిక్కిరిసి ఉండడంతో, ఆ ట్రాఫిక్‌లో కాన్వాయ్ రాజమండ్రి చేరుకోవడానికి గంటల వ్యవధి పట్టింది. అభిమానులు, నాయకులు పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విమానాశ్రయం వద్ద జగన్‌మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, 
 
 మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, అల్లూరి కృష్ణంరాజు, పాతపాటి వీర్రాజు, చెంగల వెంకట్రా వు, బుచ్చిమహేశ్వరరావు, క్రమశిక్షణ  కమిటీ రాష్ట్ర సభ్యు డు ఇందుకూరి రామకృష్ణంరాజు, నేతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చలమలశెట్టి సునీల్, బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, తాడి విజయభాస్కర రెడ్డి, దాడిశెట్టి రాజా, బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, సుంకర చిన్ని, శెట్టిబత్తుల రాజా, ములగాడ ఫణి, కొమ్మిశెట్టి రామకృష్ణ, విపర్తి వేణుగోపాలరావు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఆర్వీ సత్యనారాయణ చౌదరి,టీకే విశ్వేశ్వరరెడ్డి, రాయపురెడ్డి ప్రసాద్(చిన్నా), రెడ్డి రాధాకృష్ణ, పంపన రామకృష్ణ, ఎర్ర సత్యం, చింతపల్లి చంద్రం, మేడిశెట్టి శివరాం, తాడి హరిశ్చంద్ర ప్రసాద్‌రెడ్డి, జ్యోతుల లక్ష్మీ నారాయణ, గణేశుల పోసియ్య, నిడగట్ల బాబ్జీ తదితరులు ఉన్నారు.
 
 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా