మంత్రి ఆదికి చేదు అనుభవం

14 Apr, 2018 14:57 IST|Sakshi

సాక్షి, వైఎస్‌ఆర్‌ జిల్లా : ఫిరాయింపు మంత్రి ఆదినారాయణకి చేదు అనుభవం ఎదురైంది. మైలవరం జలాశయం గేట్లు ఎత్తడానికి వెళ్లిన మంత్రిపై కందిరీగలు దాడికి పాల్పడ్డాయి. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళ్తే.. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌, మండలి విప్‌ రామసుబ్బారెడ్డి, పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్‌ లింగారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలతో పాటు పలువురు తెలుగుదేశం కార్యకర్తలు వచ్చారు.

శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో మంత్రి ఆది గేట్లు ఎత్తారు. అయితే చాలా రోజుల నుంచి గేట్లకు ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా ప్రజలపై దాడి చేశాయి. దీంతో అక్కడ ఉన్న నాయకులు, అధికారులు తలోదిక్కు పరుగు తీశారు. ఉత్తర కాలువ వైపు కొందరు, దక్షిణ కాలువ వైపు కొందరు పరుగెత్తారు. తేనెటీగల దాడిలో మైలవరం మండల తహసీల్దారు షేక్‌ మొహిద్దీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు