వీరింతే.... మారని అధికారులు

19 Jun, 2019 12:20 IST|Sakshi
మార్కండ్రాజుపేటలో పేరుకుపోయిన వ్యర్థాలు, సంచరిస్తున్న పందులు

సాక్షి, తుని: ప్రభుత్వం మారినా అధికారుల్లో ఉదాసీనత కొనసాగుతోంది. ప్రజలకు మంచి పాలన అందించాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలను పరిగెత్తుస్తున్నారు. ఇందులో భాగంగానే 10 రోజల క్రితం తుని శాసనసభ్యుడు, విప్‌ దాడిశెట్టి రాజా మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యం బాగుండాలని, పందులు కనిపించకూడదని అధికారులకు సూచనలు చేశారు.

రెండు రోజల పాటు అధికారులు హడావుడి చేశారు. పందులను పట్టి తరలించారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు షరా మామూలే. పట్టణంలో ఎక్కడ చూసినా పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వ్యర్థాలు గుట్టలుగా ఉన్నాయి. మార్కండ్రాజుపేటలో ఇళ్ల మధ్యలో చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాలు ఉండడంతో పందులు వాటిలో సంచరిస్తున్నాయి.

సొంత ఇల్లు ఉన్నా వాసన భరించలేక పోతున్నామని పలువురు ‘సాక్షి’ దృష్టికి తీసుకు వచ్చారు. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా పారిశుద్ధ్యం నిర్వహణ బాగానే ఉందని, పరిశీలించి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన పాలన అందించాలన్న లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వలన నెరవేరడం లేదు.

మరిన్ని వార్తలు