నీటి కేటాయింపుల్లో అన్యాయం: వాసిరెడ్డి పద్మ

28 Aug, 2013 17:48 IST|Sakshi
నీటి కేటాయింపుల్లో అన్యాయం: వాసిరెడ్డి పద్మ

తెలుగుజాతి మధ్య అంతర్యుద్ధం కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలకు మేలు జరుగుతుందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్ర విభజనతో కర్ణాటక, మహారాష్ట్ర భారీగా లాభం పొందబోతున్నాయని పేర్కొన్నారు. మిగులు జలాలపై ఆధారంగా రూ. 30వేలకోట్లతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ నీటికోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. మిగులు జలాల్లో 350 టీఎంసీలకు గాను 190 పెంచాలని కర్ణాటక, మహారాష్ట్రలు అంటున్నాయని తెలిపారు.

నికర జలాల్లో రావాల్సిన 811 టీఎంసీల్లో 450మాత్రమే పొందుతున్నామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మొత్తం 710 టీఎంసీలపై హక్కు ఉన్నప్పటికీ మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. కిరణ్‌, బొత్సలు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని కిరణ్, బొత్సలు గుర్తించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాదులు ఈ విషయాన్ని గుర్తించాలని, ఎగువ రాష్ట్రాలనుంచి రావాల్సిన నీటి వాటాకోసం పోరాడాలని సూచించారు.

మరిన్ని వార్తలు