భద్రాచలంలో పెరిగిన గోదావరి వరద ఉధృతి

26 Jul, 2014 09:51 IST|Sakshi

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో నీటి మట్టం బాగా పెరిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది నీటి మట్టం 38 అడుగులకు చేరుకుంది. నదిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద నీరు 9 అడుగులకు చేరింది. దాంతో 4.60 లక్షల క్యూసెకుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే 13,300 క్యూసెక్కుల నీరు డెల్టాకు మళ్లించారు.  అయితే ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు పొంగి ప్రవహిస్తుంది. దాంతో దాదాపు 25 గ్రామల మధ్య రాకపోకలు స్తంభించాయి.

మరిన్ని వార్తలు