గోదావరికి పెరిగిన వరద ఉధృతి

3 Aug, 2019 18:22 IST|Sakshi

సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): గోదావరి నదిలో వరద నీటి ఉధృతి పెరుగుతోందని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కోరారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశముందని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాక ఉభయ గోదావరి జిల్లాల ప్రభావిత మండలాల అధికారులు ఎటువంటి ఏమరుపాటుకు లోనుకాకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. 

సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు పంపామని, లోతట్టు ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించాలని కమిషనర్‌ కోరారు. అదేవిధంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని ఆదేశించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు.

మరిన్ని వార్తలు