దేవుడా.. ఈ నీళ్లు తాగి ఎలా బతకాలి

5 Sep, 2018 14:11 IST|Sakshi

రంగు నీరు..మురుగు.. దుర్గంధం

గూడూరు పట్టణంలో నీటి సరఫరా అస్తవ్యస్తం

రోగాలబారిన పడుతున్న ప్రజలు

తాగునీరు డ్రైనేజీ నీరును తలపిస్తోంది.. రంగుమారి దుర్గంధం వెదజల్లుతోంది..దేవుడా ఈ నీళ్లు ఎలా తాగాలంటూ గూడూరు పట్టణవాసులు ఘోషిస్తున్నారు.గూడూరు పట్టణంలో డిమాండ్‌ తగ్గట్టుగా తాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేదిఅరుదు. అరకొరగా సరఫరా అవుతున్న నీరు కూడా దారుణంగా ఉంటోందనిప్రజలు ఆగ్రహిస్తున్నారు. నీటి సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులుస్పందించడం లేదు. తరచూ పైపులైన్లు పగిలిపోతుండడంతో కండలేరునుంచి సరఫరా అవుతున్న నీరు కలుషితమవుతోంది. వర్షాలు సక్రమంగాకురవక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. మున్సిపల్‌ నీరేదిక్కయింది. మురుగు నీరొస్తోందని అధికారులను ప్రజలు అడుగుతుంటేసమాచారం లేదంటూ తప్పించుకుంటున్నారు.

గూడూరు: గూడూరు పట్టణానికి కండలేరు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. పైపులు నాసిరకంగా ఉండడంతో అవి తరచూ పగిలిపోతూ కలుషిత నీరు వస్తోంది. దీంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తరచూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ లీకులను సరి చేయకపోవడంతో సరఫరా అవుతున్న నీరు కూడా కలుషితంగా మారి, మురుగు నీటిని తలపించేలా ఉంది. ఆ నీరే పట్టణ ప్రజలకు దిక్కవుతోంది. అసలే జ్వరాల తీవ్రతతో ఆస్పత్రుల పాలై అల్లాడుతుంటే, సరఫరా అవుతున్న కలుషిత నీరు తాగితే మరిన్ని జబ్బులు వచ్చి మంచాన పడతామని వారు వాపోతున్నారు. దీంతో విధి లేక క్యాన్‌ వాటర్‌నే కొని తాగాల్సి వస్తోందని, దీంతో ఖర్చు మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల

ప్రకారం ప్రస్తుతం గూడూరు పట్టణ జనాభా 78,700 ఉండగా 12,400 ఇళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో పట్టణానికి ఒక రోజుకు 10 లక్షల మిలియన్‌ లీటర్ల నీరు అవసరం ఉంది. సగటున ఒక్కొక్కరికీ 100 లీటర్ల నీటిని అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం అధికారికంగా 5,541 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా అదే సంఖ్య ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

పగులుతున్న పైప్‌లైన్లు  
కండలేరు నుంచి గూడూరుకు తాగునీటిని సరఫరా చేసే పైపులు నాసిరకమైనవి ఏర్పాటు చేయడంతో అవి పలు ప్రాంతాల్లో తరచూ పగిలిపోయి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. అలా పగిలిపోయిన పైప్‌లను తిరిగి మరమ్మతులు చేసే క్రమంలో సక్రమంగా చేయకపోవడంతోనే   ఆ ప్రాంతంలో లీక్‌ అయి మురుగు నీరు పైపుల్లోకి ప్రవహించి దుర్గంధభరితమైన తాగునీరు సరఫరా అవుతోంది. ఒక్కోసారి అసలు తాగునీరే సరఫరా కాక వాటి కోసం పడరానిపాట్లు పడాల్సి వస్తోం దని పట్టణ ప్రజలు వాపోతున్నారు. స్పందించాల్సిన ప్రజాత్రినిధులు, అధికారులు మిన్నకుండిపోతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!

‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీకి సాయంపై వరల్డ్‌ బ్యాంక్‌ స్పష్టత

విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌

‘గోదావరి జిల్లా వాసుల కల నిజం చేస్తా’

‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’

నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!

నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి

‘అర్చకులు బాగుంటేనే ఆలయాలు బాగుంటాయి’

అవినీతి అంతా బయటకు తీస్తాం: చీఫ్‌ విప్‌

సెంట్రల్‌ జైలులో మృత్యుఘోష

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా..

అది చిరుత కాదు హైనానే

ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి

సదా ప్రజల సేవకుడినే

నిబంధనలు తూచ్‌ అంటున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు: వైఎస్‌ జగన్‌

నారాయణ కళాశాల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

‘చంద్రబాబు కోటరీలో వణుకు మొదలైంది’

పన్నులు కట్టండి.. కర్తవ్యాన్ని పాటించండి

పులివెందులలో ప్రగతి పరుగు

సమగ్రాభివృద్ధే విజన్‌

వడ్డీ జలగలు..!

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

గుట్టుగా గుట్కా దందా

చరిత్ర సృష్టించిన ప్రకాశం పోలీస్‌

ఇక గ్రామ పంచాయతీల వ్యవస్థ 

సచివాలయం కొలువులకు 22న నోటిఫికేషన్‌

బల్లికి 3,000.. ఎలుకకు 10,000

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది