కాంట్రాక్టర్లకు కాసుల పండుగ.. రైతులకు తప్పని ఇక్కట్లు

6 Mar, 2019 14:31 IST|Sakshi
శిథిలమైన వంశధార కుడిప్రధాన కాలువ లైనింగ్‌  

సాక్షి, సరుబుజ్జిలి(శ్రీకాకుళం): మండల పరిధిలో సుమారు 4500 హెక్టార్ల సాగు భూమిని కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్నారు. అయితే ఈ కాలువ గట్లు సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా రైతులకు కష్టాలు తప్పడం లేదు. వంశధార కుడి ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ విషయమై వంశధార అధికారులకు పలు సమావేశాల్లో అందించిన వినతులు బుట్టదాఖలవుతున్నాయి.

గత రెండేళ్లకాలంలో వంశధార కాలువలకు నీరు చెట్టు పథకంలో భాగంగా చేపట్టిన పనుల వలన కాంట్రాక్టర్ల జేబులు నిండాయి తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నాయకులు తూతూమంత్రంగా పనులు నిర్వహించారని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు