శ్రీశైలం నుంచి నీరు విడుదల

19 Mar, 2017 19:09 IST|Sakshi

శ్రీశైలం: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు శనివారం నుంచి ఆదివారం వరకు 5,657 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రెండు జలవిద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 5,391 క్యూసెక్కులను విడుదల చేయగా, బ్యాక్‌వాటర్‌ నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 266 క్యూసెక్కులను విడుదల చేశారు.

పగటిపూట ఉష్ణోగ్రతల కారణంగా జలాశయంలో ఉన్న నీటిలో 284 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు అధికారులు తెలిపారు. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 1.728 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 0.708 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 36.9800 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 814.40 అడుగులుగా నమోదైంది.

>
మరిన్ని వార్తలు