ఎన్నికలకు సర్వసన్నద్ధం

16 Mar, 2019 08:18 IST|Sakshi
డీజీపీ ఠాగూర్‌తో వీడియో కాన్ఫెరెన్స్‌లో ఏలూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ రవిప్రకాష్‌

సాక్షి, ఏలూరు : సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉం దని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ ఎం.రవిప్రకాష్‌  తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాగూర్‌ అన్ని జిల్లాల పోలీసు అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఎన్ని కల నిర్వహణ సిబ్బంది నియామకాలు, ఏర్పాట్లపై పోలీసు అధికారుల నుంచి డీజీపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో ఎన్నికల సందర్భంగా విస్తృతంగా  తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటివరకూ రూ.1.50 కోట్ల నగదు, 30.134 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు. 1,761 మద్యం బాటిల్స్, 33 లీటర్ల సారా, 206 కిలోల నల్ల బెల్లం పట్టుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 2,007 మంది వ్యక్తులపై బైండోవర్‌ కేసులు నమోదు చేయడంతో పాటు 25 లైసెన్స్‌లు లేని ఆయుధాలను, 366 లైసెన్స్‌ ఉన్న ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లాల సరిహద్దుల్లో 11 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను ని యమించామన్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణా ళికతో పనిచేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అన్ని భద్రతా చర్యలు చేపట్టిందన్నారు.

జిల్లాలో రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎక్కడైనా గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే  కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును  వినియోగించుకునేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తున్నామన్నారు.   

మరిన్ని వార్తలు