నాకొద్దు బాబోయ్..

27 Feb, 2014 02:31 IST|Sakshi

రాయదుర్గం
 తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలో ఇకపై తాను రాయదుర్గం నియోజకవర్గం ఇన్‌చార్జ్ బాధ్యతలకు దూరంగా ఉంటానని దీపక్‌రెడ్డి (జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు) పేర్కొన్నారు.

 

బుధవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాను గత ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సెంటిమెంట్ వల్ల ఓడిపోయినా తరువాతి కాలంలో టీడీపీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలిచే పరిస్థితి ఉందని, అయితే... కొందరు కుట్రదారులు, స్వార్థ రాజకీయ నాయకులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నార ని ఆరోపించారు. మూడు నెలల నుంచి కేవీ ఉష అనే మహిళను రంగంలోకి దింపి పార్టీ నాయకులు, కార్యకర్తలను అయోమయంలోకి నెట్టారనిపర్కొన్నారు.

 

ఆమె నియోజకవర్గంలో ఇల్లిల్లూ తిరుగుతూ.. చీరలు పంచుతూ తానే అభ్యర్థినని ప్రాచారం చేసుకుంటున్నారని వాపోయారు. పార్టీని దెబ్బతీస్తున్న కుట్రదారులు, వెన్నుపోటుదారులపై జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు.

 

రాయదుర్గం పట్టణ కమిటీతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల కమిటీలు, 55 మంది సర్పంచులు తన నాయకత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినా ముఖ్య నాయకులు తనపై సవతి ప్రేమ చూపుతూ పార్టీని దెబ్బతీసే పరిస్థితి కలిగించారని ఆరోపించారు. కష్టనష్టాలు అనుభవించిన కార్యకర్తలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో తాను ఇన్‌చార్జ్ బాధ్యతలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.  
 
 
 

మరిన్ని వార్తలు