రక్తాన్నైనా చిందిస్తాం

17 Aug, 2013 02:55 IST|Sakshi

 తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: ‘ఒకే రాష్ట్రం కోసం రక్తాన్నైనా చిందిద్దాం.. సమైక్యాంధ్రను సాధిద్దాం’ అంటూ సమైక్యాంధ్ర వాదులు రక్తార్చన చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి చేస్తున్న రిలే దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం దీక్షలో ది ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నా యకులు భక్తవత్సలం, సుబ్బరాయుడు, శంకర్, శివశంకర్‌రెడ్డి, అనూస్, ప్రసాద్‌రెడ్డి, మదనగోపాల్, టీ ఆర్‌కే.రావు, బాలాజీ, బాలకృష్ణంరాజు, సుధాకర్‌రెడ్డి, సోమశేఖర్, గణపతి, రవీంద్రనాథ్, కాంతారావు పా ల్గొన్నారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసిన రక్తాన్నైనా చిందిద్దాం-సమైక్యాంధ్రను సాధిద్దాం అన్న బ్యానర్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ప్రారంభిం చారు.
 
  అనంతరం సమైక్యవాదులు స్వచ్ఛందంగా సమైక్యాంధ్రకు మద్దతుగా రక్తార్చన (వేలిముద్రలతో) చేయించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, నాయకులు మబ్బు చెంగారెడ్డి, మునిశేఖర్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ఐఎంఏ జే ఏసీ కో-కన్వీనర్ డాక్టర్ శ్రీహరిరావు, మబ్బు యువసేన నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై రక్తార్చన చేశారు. రిలే దీక్షలో భాగంగా శనివారం ఉ దయం పది గంటలకు ప్రజాబ్యాలెట్ నిర్వహించనున్నారు. సుధారాణి మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోరుకునే సీమాంధ్రులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే చేతగాని వాళ్లుగా రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తున్నారని అన్నారు. సాప్స్ అధ్యక్షుడు కోడూరు బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి సమైక్య వాణి వినిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాప్స్ నాయకులు కేఎస్.వాసు, ఉప్పలపాటి శ్రీనివాసచౌదరి, విశ్వం విశ్వనాథరెడ్డి, వెంకటేశ్వర్లు, శేషగిరిరావు, కేవీ.రత్నం పా ల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు