2 వేల క్వారంటైన్ బెడ్లు సిద్ధం: మంత్రి బొత్స

1 Apr, 2020 11:57 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరోజు సమీక్షిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి వైరస్‌ నియంత్రణకు సహకరించాలని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఢిల్లీ వెళ్లినవారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సరిహద్దుల్లో ఉన్నవారికోసం భోజన వసతి ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
(చదవండి: ఢిల్లీ వెళ్లిన వారెవరు)

ఆయన మాట్లాడుతూ.. ‘950 రైతు బజార్లు, మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేశాం. 2 వేల క్వారంటైన్ బెడ్లు సిద్ధం చేశాం. నియోజకవర్గ స్థాయిలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టాం. మామిడి ఎగుమతులపై దృష్టిపెట్టాం. పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్‌లో కూర్చుని ప్రతిపక్ష నేత అనవసర ఆరోపణలు చేస్తున్నారు. కరోనాను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు విమర్శలు చేసుకునే సమయం కాదు. రాజకీయ కోణంలో ఆలోచించి ఆరోపణలు చేయడం తగదు’అని అన్నారు.
(చదవండి: పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు)

మరిన్ని వార్తలు