ఉమ్మడి రాజధానికి ఒప్పుకోం

18 Nov, 2013 05:17 IST|Sakshi

జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఆర్టికల్ 371‘డి’ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుకాదని, ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చే యొచ్చని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. విఠల్ అన్నారు. ఉమ్మడి రాజధానికి ఒప్పుకునే ప్రసక్తేలేదని, ఆ పేరుతో జరిగే కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ వాదులకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బాలుర జూనియర్ కళాశాల ఆడిటోరియంలో టి. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆర్టికర్ 371‘డి’పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్టికల్ ఉండాల్సిందేని అన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని, జిల్లాల వారీగా రిక్రూట్‌మెంట్‌లు లేకుండాపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
 
 లోకల్ రిజర్వేషన్ల లేకుండాపోయి ఇక్కడి ప్రజలకు తీరనినష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణకు రాష్ట్రపతి హక్కులు రావాలంటే 371‘డి’ ఆర్టికల్ ఉండాలన్నారు. దేశంలో ఎక్కడాలేని ఉమ్మడి రాజధాని తెలంగాణలో ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కేవలం తాత్కాలిక రాజధానిగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధాని అంటే మరో పోరాటం చేయాల్సిందేనన్నారు. తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని, హైదరాబాద్‌పై తెలంగాణ రాష్ట్రానికే సర్వాధికారాలు ఉండాలన్నారు. 13ఏళ్ల శాంతియుత పోరాటం, వెయ్యిమంది అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడి పాలకులపై ఉందన్నారు.
 తెలంగాణలో 371 ‘డి’
 ఉండాల్సిందే..
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్టికల్ 371 ‘డి’ అడ్డుకాదని హైకోర్టు న్యాయవాది ప్రకాష్‌రెడ్డి, హైదరాబాద్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. రేపు ఏర్పడబోయే తెలంగాణలో కూడా ఈ ఆర్టికల్ ఉండాల్సిందేనని అన్నా రు. రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడినా ప్రత్యేకరాష్ట్రం ఇవ్వవచ్చన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సదస్సులో ఇంటర్ విద్య ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చై ర్మన్ మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట య్య, కార్యదర్శి శ్రీనివాస్, కోషాధికారి గోవర్దన్, నాయకులు లక్ష్మారెడ్డి, తిరుపతయ్య, మాధవరావు, సతీష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు