రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి: లగడపాటి

5 Jul, 2013 12:41 IST|Sakshi
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి: లగడపాటి

న్యూఢిల్లీ :  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ను శుక్రవారం విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. ఆయన ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దిగ్విజయ్ని కోరారు. ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని లగడపాటి గత కొంతకాలంగా ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ అంశంపై చేసిన ప్రకటనలు తెలంగాణ, సీమాంధ్ర నేతలు, ప్రజల్లో ఎన్నో చిక్కు ప్రశ్నలకు తెర తీసింది. అడుగడుగునా అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించాలని అధిష్టానం ఆలోచిస్తోందని చెప్పిన దిగ్విజయ్... ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను రూపొందించే బాధ్యతను మాత్రం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు అప్పగించారు. దీంతో మరోసారి రాష్ట్రంలో తెలంగాణ, సమైక్య సెగ రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాల నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ను కలిసి తమ తమ వాదనలు వినిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు