ప్రతి క్లాజ్‌కు సవరణలు కోరదాం

8 Jan, 2014 03:04 IST|Sakshi
  • సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నిర్ణయం
  •  సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో పునర్విభజన బిల్లుపై చర్చలో పాల్గొని ప్రతి క్లాజ్‌పైనా సవరణలు ప్రతిపాదించాలని సీవూంధ్ర కాంగ్రె స్ నేతలు నిర్ణరుుంచారు. బిల్లుపై కూలంకషంగా చర్చించడంతోపాటు అంతివుంగా ఆ బిల్లును వ్యతిరేకిస్తూ స్పష్టమైన అభిప్రాయూలు వ్యక్తపరచాలని తీర్మానించారు.
     
    వుంగళవారం న్యాయుశాఖ వుంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నివాసంలో సీవూంధ్ర నేతలు కొందరు సమావేశమై బిల్లులోని చర్చలో పాల్గొనాల్సిన అంశాలపై చర్చించారు. వుంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ ఉండవల్లి అరుణకువూర్, ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, వుల్లాది విష్ణు, వుుత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
     
    అసెంబ్లీ, కౌన్సిల్‌లో బిల్లు పై చర్చ సాగించడమే వుంచిదని, బిల్లుపై ఎంత ఎక్కువవుంది వ్యతిరేకత వ్యక్తపరిస్తే పార్లమెంటులో అంత గట్టిగా ఎంపీలు వూట్లాడేందుకు ఆస్కారవుుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సాగునీరు, విద్యుత్తు, హైదరాబాద్, ఉద్యోగులు, పెన్షనర్లు, 371 డి ఇలా అనేకాంశాలను సభ్యులంతా వుుక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరవుుందన్నారు.  
     
    క్లాజులకు సవరణలు ప్రతిపాదించి డివిజన్ కోరడం ద్వారా బిల్లును వ్యతిరేకించ వచ్చని, అది బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానించినట్లే అవుతుందని గాదె అన్నారు. 
మరిన్ని వార్తలు