'సమైక్యంగా ఉంచాలని ఆంటోనిని కోరతా'

20 Aug, 2013 14:33 IST|Sakshi
'సమైక్యంగా ఉంచాలని ఆంటోనిని కోరతా'

హైదరాబాద్ నగర అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజలకు భాగస్వామ్యం ఉందని రాష్ట మంత్రి కొండ్రుమురళి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ముఖ్య కేంద్రాలన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎ.కే.ఆంటోనిని కోరతామని ఆయన స్పష్టం చేశారు.

 

తెలంగాణ ప్రత్యేక  రాష్ట్ర ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ వేయాలని ఆయన యూపీఏ సర్కార్ను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనేది కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వ్యక్తిగత అభిప్రాయమని కొండ్రుమురళి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు మంగళవారం ఆంటోని కలవనున్నారు.

 

ఈ సందర్బంగా వారంతా న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం తమను కలవాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీఎం కిరణ్కు పిలుపు వచ్చింది. దాంతో ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీ పయనమైయ్యారు. అదికాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీఎం కిరణ్ ఈ రోజు న్యూఢిల్లీలో పేర్కొన్న విషయం కూడా విధితమే.
 

మరిన్ని వార్తలు